- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే బహిరంగ సభకు శుక్రవారం హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ గౌడ్ , వెన్న రాజు, బూరుగు కిష్ట స్వామి , వెంకటస్వామి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -