Thursday, December 4, 2025
E-PAPER
Homeజిల్లాలుశారాజీపేటలో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం

శారాజీపేటలో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం

- Advertisement -

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ గడపగడపకు ప్రచారం
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం గురువారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కంతి మధు గ్రామంలో సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కంతి మధు మాట్లాడుతూ.. మా పై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన ,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆశించిన అభివృద్ధిని శారాజీపేటలో అమలు చేస్తామన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయకుమార్, ఎండి సలీం, బిజనీ భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న దూడల శ్రీధర్, చిలుకు నాగరాజు, ఐలా యాకాయ, బోదాస్ నర్సింగరావు, దూడల సంతోష, కంతి బిక్షపతి, కంతి బాలరాజు, పెండ్యాల సత్యనారాయణ, పుట్టల పరశురాం, పెండ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -