నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఆదేశాలు మేరకు గ్రామ గ్రామాన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్, లచ్చన్, కొడచర, ఆవల్గావ్ ,చిన్న ఎక్లార, రుశేగావ్ ,షేక్కాపూర్, గ్రామంలో లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ నాయకులు ఆయా గ్రామాలను సందర్శించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన లబ్ధిదారులు ఏండ్ల తరబడి ఎదురు చూడగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమైందని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులంతా ప్రజా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు .ఈ కార్యక్రమలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్వార్ సాయిలు, ,సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి, విట్టల్ గురూజీ , మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వట్నాల్ రమేష్ , సుల్తాన్ పేట్ మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు దావత పటేల్, కొడచర మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్ , మద్నూర్ మండల యువజన అధ్యక్షులు హన్మత్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నాగేష్ , దన్నూర్ దేవిదాస్ పటేల్, హన్మండ్లు బండివార్, తడగూర్ ఈరన్న , యువ నాయకులు సుభాష్ కొండవార్ , ఏడు గ్రామాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES