Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించిన కాంగ్రెస్ నాయకులు

లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు మంజూరైన వాటిని కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. మద్నూర్ మండలంలోని హెచ్ కె లూరు, గోజేగావ్, గ్రామాల్లో నాయకులు పర్యటించి నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు సౌభాగ్యం అంటూ పేర్కొన్నారు.

అర్హులైన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నూతన రేషన్ కార్డులు అందుకున్న నిరుపేదలకు నెల నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం లభిస్తాయని, ఆ కుటుంబానికి రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజా ప్రభుత్వం నిరుపేదల కోసమే పని చేస్తుందని, పంపిణీ కార్యక్రమంలో నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విఠల్ గురూజీ, కొండా గంగాధర్, వట్నాల రమేష్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్, గోజేగావ్ తాజా మాజీ సర్పంచ్ అనిత ఇర్వంత్ దేశ్ముక్, మాజీ ఎంపిటిసి విజయ్, ఆయా గ్రామాల రేషన్ కార్డుల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -