నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ నూతన కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రేడ్ వన్ ఆఫీసర్ శ్రావణి ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్టు కాంగ్రెస్ నాయకులు బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణం లో గల 30 వ వార్డు 29వ వార్డు 13వ వార్డు లో గల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. వీరితోపాటు 13వ వార్డు ఇంచార్జ్ కన్నం లక్ష్మణ్ ,30 ఇంచార్జ్ పింజా అభినవ్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నం ప్రసాద్,పసుపుల నరేష్, గుంజల సుమన్ ,పింజ రాజశేఖర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.
అమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో..
మున్సిపల్ నూతన కమిషనర్ శ్రావణి ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ సయ్యద్ ఆవేస్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి మహమ్మద్ రజాక్ మైనార్టీ సెక్రటరీ ఆమీర్ తదితరులు పాల్గొన్నారు.



