నవతెలంగాణ – బాన్సువాడ- నసురుల్లాబాద్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరయ్యే భారీ సమావేశానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వైపు బయలుదేరారు. శుక్రవారం ఈ విషయాన్ని మాజీ బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పాల్గొనే సమావేశాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బాన్సువాడ నియోజకవర్గ నలుమూలల నుండి వాహనాల్లో అధిక సంఖ్యలో కార్యకర్తలు బయలుదేరుతున్నారాని అన్నారు. వీరి వెంట వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ కు తరలిన కాంగ్రెస్ నేతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES