నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూషబోయిన సంతోష, వార్డు సభ్యులతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను బోకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూషబోయిన సంతోషకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా అభ్యర్థి సంతోష మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ యూత్ మాజీ అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్, వార్డ్ అభ్యర్థులు నల్ల మాసు కృష్ణయ్య, గడసందల సత్తయ్య, నల్ల మసు కుమార్, బాలరాజు గౌడ్, కాంగ్రెస్ నాయకులు గడసందుల శీను, పద్మ ప్రశాంత్, కొమ్ము నగేష్, రాగీరు కృష్ణ, అఖిలపక్ష నాయకులు ఏలిమినేటి పాపి రెడ్డి, నంగునూరి నర్సింహా, గుండు హరినాథ్ రెడ్డి, బలుగురి ఎల్లారెడ్డి, సాయిరెడ్డి పోషి రెడ్డి, రాళ్ల బండి శేఖరా చారి, గుండు హరినాద్ రెడ్డి లు పాల్గొన్నారు.



