- Advertisement -
- – అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయండి మండల పార్టీ అధ్యక్షులు సాయిలు
- నవతెలంగాణ – మద్నూర్
- మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పార్వతి బాయి నాగనాథ్ హవా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు గురువారం అంతాపూర్ గ్రామాన్ని సందర్శించారు ఎన్నికల ప్రచారంపై ఆరా తీయగా పార్వతిబాయి కొనసాగుతుందని తెలిపారు. ఆ గ్రామ అభ్యర్థి పార్వతిబాయి తో పాటు వారి కుటుంబ సభ్యులు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే హవా ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగించాలని సూచించారు. ఎవరికి తక్కువ వంచన వేయకూడదని ఎదుటి వారు కూడా గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించి గెలుపే ముఖ్యంగా పనిచేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు తో పాటు మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ పాల్గొన్నారు.
- Advertisement -



