నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ, పార్టీ ప్రటిష్టతకు పాటుపడుతున్న నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నాగాపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



