Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్‌ పార్టీవి 420 హామీలు: చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ పార్టీవి 420 హామీలు: చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

ఈ నెల 5 నుండి వార్డుల వారిగా నూతన కమిటీల ఏర్పాటు..
పరకాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ – పరకాల 

420 దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని,కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం పరకాలలో పట్టణ బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డుల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన బిఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశాలు పార్టీ కల్పిస్తుందన్నారు.పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి మోసం చేసి పార్టీ మారిన ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు.ఈ నెల 5తేదీ నుండి పరకాల పట్టణంలో వార్డుల వారిగా సమావేశాలు నిర్వహించి 5 రోజుల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని సీనియర్ నాయకులకు ఆదేశించారు.అనంతరం పట్టణ కమిటీ ఎన్నిక ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

కమిటీల ఏర్పాటుకు ఇంచార్జీలుగా పరకాల మాజీ ఎంపీపీ నేతాని శ్రీనివాస్ రెడ్డి,సంగెం మండల మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి,నడికుడ మండల మాజీ రైతుబంధు కన్వీనర్ సూదాటి వెంకటేశ్వర రావు,దామెర మండల పార్టీ అధ్యక్షులు గండు రాము మరియు పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే నియమించారు. పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేసే విధంగా కమిటీల ఏర్పాటు ఉండాలన్నారు.

పార్టీలో అవకాశాలు రాని నాయకులు,కార్యకర్తలు నిరాశ చెందవద్దని కోరారు.పార్టీ అందరికి సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు.కాంగ్రెస్ అక్రమ కేసులకు,బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని మీకు అండగా ఎల్లపుడు నేను ఉంటానని తెలిపారు.రాబోయే రోజులు బిఆర్ఎస్ వే అన్నారు.బేషజమ్యాలకు వెళ్లకుండా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ నాయకులు,మాజీ మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు,సొసైటీ చైర్మన్లు,డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -