నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, జెండాను ఎగురవేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, సర్పంచ్ లు బండి స్వామి, కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, వొన్న తిరుపతి రావు,తిర్రి అశోక్, ఇందారపు సారయ్య, పైడాకుల దేవేంద్ర సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఐత రాజిరెడ్డి, బండి రాజయ్య, ప్రకాష్ రావు, సురేష్ రావు, మెరుగు రాజయ్య, దుర్గాప్రసాద్, ఇందారపు శివ, ప్రభాకర్, తిర్రి సమ్మయ్య, మధు, రాజ సమ్మయ్య, శ్రీనివాస్, బొబ్బిలి నరేశ్ పాల్గొన్నారు.
తాడిచెర్లలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



