నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈనెల 21న మొదలు కానున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో ఈనెల 15న ముందస్తు సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, నిత్యావసర ధరలు తదితర అంశాలపై అధికార ఎన్డీయె కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.
ఈనెల 21 నుంచి వచ్చే నెల ఆగష్టు 21 వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు జరగనున్నాయి. ఈసారి మొత్తం నెలరోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆగష్టు 13,15 తేదీల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ రెండు రోజులు పార్లమెంట్ సమావేశాలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా కేంద్రం ప్రభుత్వం కూడా ఈనెల 19న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది.