నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ను లైంగిక వేధించారని ఆరోపణలు రాగానే ముందుగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తాజాగా అతడిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.
మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్, ఒక ట్రాన్స్‌జెండర్, పలువురు మహిళలు.. ఎమ్మెల్యే రాహుల్‌పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేశారు. హోటల్ గది బుక్ చేశాను.. అక్కడికి రావాలంటూ వేధిస్తున్నాడని.. సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నాడని ఆరోపించారు. ఇదే కోవలో చాలా మంది మహిళలు ఉన్నారని వాపోయారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాంండ్ చేశారు. ఆందోళనలు, నిరసనలు తీవ్రం కావడంతో కాంగ్రెస్ అప్రమత్తమై పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.