- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొడ్డు రేణుక ఇంటిపై ప్రత్యర్ధి వర్గీయులు దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి గురైన బాధితురాలు బొడ్డు రేణుక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



