వనపర్తిని టాప్ 10లో నిలబెడుదాం
ప్రతి కార్యకర్త ఓ సోషల్ మీడియా వారియర్ గా పనిచేద్దాం
పాత, కొత్త బేదం లేదు అందరిది ఒకటే నినాదం.. జై కాంగ్రెస్
20 నెలల్లో రూ.1759 కోట్ల అభివృద్ధి
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని గ్రామాల్లో, మండలాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చేందుకు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ ఒకే నినాదంతో జై కాంగ్రెస్ అంటూ పనిచేయాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో వనపర్తి నియోజకవర్గం విద్యాపరంగా వైద్యం పరంగా వ్యవసాయపరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందబోతోందని ఆయన పేర్కొన్నారు.
వనపర్తి నియోజకవర్గానికి 6 కొత్త సింగిల్ విండోలు, 2 కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులు, రాబోతున్నాయని ఈ సందర్భంగా ఇంకొంచమందికి రాజకీయపరమైన పదవులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యాపరంగా త్వరలోనే వనపర్తికి కేంద్రీయ విద్యాలయం, నవోదయ, వెటర్నరీ కళాశాల, అనుసంధానంగా ఏడు వెటర్నరీ ఆసుపత్రులు, స్పోర్ట్స్ స్కూల్, టర్ఫు హాకీ మైదానం, స్విమ్మింగ్ పూల్, అనుసంధానంగా జిమ్ము, పాలిటెక్నిక్ కళాశాల పునరుద్ధరణ, హాం ప్రాజెక్టు ద్వారా రహదారుల బలోపేతం, చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వనపర్తి నియోజకవర్గంలో 1759 ఓట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేళ్ల పాలనలో కేవలం జీవోలకే పరిమితమయ్యారు కానీ నిధులు మంజూరు చేయలేదన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, తాను ఎక్కడ మాట తప్పే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్యే అన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఓ సోషల్ మీడియా వారియర్ గా పని చేయాలని మనం చేసే చిన్న పనినైన ప్రజలకు తెలిసేలా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.