రామ్ పోతినేని నటించిన కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు (గురువారం) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకులు వివేక్, మెర్విన్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘మా ఇద్దరిదీ చెన్నై. మేము తమిళంలో 20 సినిమాలు చేశాం. ఇది తెలుగులో మా మొదటి సినిమా. 2024లో రామ్ మాకు కాల్ చేశారు. చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నారని ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఒక నెల రోజులు తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. అలా ఈ సినిమాకి పని చేశాం. ఇప్పటివరకు ఈ సినిమాలోని నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు పాటలు ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాటలు అవి. అందుకే ఇప్పుడే రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తాం. ఇందులో ప్రతి పాట విజువల్‌గా, స్టన్నింగ్‌గా ఉంటుంది. ఇందులో ప్రతిదీ మాకు ఫేవరెట్ సాంగే. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆడియన్స్ ఒక రెట్రో సౌండ్‌ని ఫీలవుతారు. మేము ఈ సినిమాలో పాటలకి లిరికల్‌గా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. పాటలే కాదు సినిమా కూడా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’ అని వివేక్, మెర్విన్ చెప్పారు.


