ప్రధాని మోడీపై కాంగ్రెస్ విమర్శ
న్యూఢిల్లీ : ఆధునిక భారతాన్ని నిర్మించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ అందించిన అపారమైన, విశేష సేవలను ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరిస్తున్నారని, అవమానిస్తున్నారని, వక్రీకరిస్తున్నారని, రాక్షసంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తన వారసత్వంపై జరుగుతున్న ఈ దాడి నుండి భారత దేశ తొలి ప్రధాని బయటపడాలని, బయటపడతారని పేర్కొంది. దేశ 20వ శతాబ్దపు చరిత్ర నుంచి నెహ్రూను తుడిచిపెట్టాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారిలోని అభద్రతలు, భయాలు ఈ రకంగా ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. నెహ్రూ 136వ జయంత్రి సందర్భంగా కాంగ్రెస్ ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇక్కడ శాంతివనంలోని నెహ్రూ మెమోరియల్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీలు పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ వారసత్వం కలకాలం దిక్సూచిలా నిలిచి వుంటుందని చెప్పారు. భారతదేశం గురించి ఆయన ఆలోచనలు, విలువలనేవి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం వీటిల్లో ప్రతిబింబిస్తాయన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, స్వతంత్ర భారతంలో రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలకు నెహ్రూ పునాది వేశారని కొనియాడారు. తన దార్శనికత, నిర్భయంతో కూడిన ఆయన నాయకత్వం వల్లనే ఇదంతా సాధ్యమైందని, దేశానికి సరికొత్త దిశా నిర్దేశం అందించగలిగారన్నారు. ఈనాటికీ ఆయన విలువలు, ఆదర్శాలు మనకు స్ఫూర్తి కలిగిస్తూనే వుంటాయన్నారు.
నెహ్రూ సేవలను తుడిచేసే కుట్ర
- Advertisement -
- Advertisement -



