Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర

కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర

- Advertisement -

ఖండించిన వాంగ్‌చుక్‌
తదుపరి సుప్రీంకోర్టు విచారణ ఫిబ్రవరి రెండుకి వాయిదా


న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రకటన చేశానని తనపై వచ్చిన ఆరోపణలను వాతావరణ ఉద్యమకారుడు సోనామ్‌ వాంగ్‌చుక్‌ గురువారం ఖండించారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ప్రజాస్వామ్య హక్కు తనకు ఉందని ప్రస్తుతం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం నిర్భంధించడానికి వ్యతిరేకంగా ఆయన భార్య గీతాంజలి ఆంగో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ పిబి వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ విచారణలో పోలీసులు వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని సమర్థించుకున్నారు.

లఢక్‌కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని కూల్చివేయాలని వాంగ్‌చుక్‌ చెప్పిన్నట్లుగా ఉన్న వీడియా ధర్మసనం ముందు వుంచారు. అయితే ఈ వీడియోను గీతాంజలి ఆంగో తరుపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ఖండించారు. వాంగ్‌ చుక్‌ అలా అనలేదని, వీడియా యొక్క ట్రాన్స్కిప్షన్‌ ఇస్తానని ధర్మాసనానికి తెలిపారు. అలాగే, ప్రభుత్వం సహాయం చేయకపోతే లడఖ్‌ ప్రజలు భారత సైన్యానికి సాయం చేయరని వాంగ్‌చుక్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనే ఆరోపణలను కూడా సిబాల్‌ ఖండించారు. అదేవిధంగా హిందూ దేవుళ్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలను కూడా సిబాల్‌ ఖండించారు. కొన్ని సోషల్‌ మీడియా విభాగాలు ఆ విధంగా ప్రచారం చేశాయని, వాంగ్‌చుక్‌ భార్య హిందూమతాన్నే అనుసరిస్తారని గుర్తు చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి రెండుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. లఢక్‌లో రాష్ట్రహోదా డిమాండ్‌తో జరిగిన నిరసనల నేపథ్యంలో గతేడాది సెప్టెంబరు 26ను వాంగ్‌చుక్‌ను కఠినమైన ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టు చేశారు. వాంగ్‌చుక్‌ హింసను ప్రేరేపించాడని కేంద్రం ఆరోపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -