నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అంబేద్కర్ మండల యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి,భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదువుతూ భారత రాజ్యాంగన్నీ గౌరవిస్తూ, అనుసరిస్తూ దాని విశిష్టతను కపడుతామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వర్ణించలేనిదని, ప్రాణం పెట్టి భారత రాజ్యాంగ రచన చేసారని వారి త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గుర్రం నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఏవైఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



