Sunday, December 7, 2025
E-PAPER
Homeజాతీయంప్రమాదంలో రాజ్యాంగం

ప్రమాదంలో రాజ్యాంగం

- Advertisement -

అంబేద్కర్‌ ఆలోచనల్ని కాపాడుకోవాలి : రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్‌ అంబేద్కర్‌ 70వ వర్థంతి. ఈ నేపథ్యంలో కేంద్రం మహాపరినిర్వాణ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం పార్లమెంటులో అంబేద్కర్‌ విగ్రహానికి రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆలోచనల్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు. అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ”బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఒక మహౌన్నత జాతీయ వ్యక్తి. ఆయన ఆలోచనలు భారతదేశ ప్రజాస్వామ్య, సామాజిక చట్రాన్ని మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంబేద్కర్‌ ఒక ఆదర్శం. ఆయన దేశం మొత్తానికి ఒక మార్గాన్ని చూపించారు. ఆయన మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. అందుకే ఆయనను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాము. ఆయన ఆలోచనల్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రతి భారతీయుడి రాజ్యాంగం ముప్పులో ఉంది. మేము దాన్ని రక్షిస్తాము. పౌరులు దానిని రక్షిస్తారు” అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -