నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని 13వ వార్డు ప్రగతి నగర్ లో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందని, ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. గురువారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ , ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలోని 13వ వార్డు ప్రగతి నగర్ లో బొక్క లక్ష్మయ్య వారి ఇంటి పైన సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందని, అక్కడ ఉన్న స్థానికులు అందరూ చూసి ఆ పనులు వెంటనే ఆపివేయడం జరిగిందన్నారు. ఆ టవర్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రజల ఆరోగ్యం దృష్టి పెట్టుకొని నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు.
ఆ ఇంటిపైన బిగించిన మిషన్లను వెంటనే తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి సెల్ టవర్ నిర్మాణం వెంటనే నిలిపివేయని లేనియెడల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో యాంపల పాపిరెడ్డి, బంగారి రామస్వామి గౌరీ శంకర్, శ్రీకాంత్, గుర్రాల శ్రీశైలం, రాజేశ్వర్, బర్ల వెంకటేష్, వల్లదాసు అంజయ్య,కొత్త లలిత, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, రజక వృత్తి సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సలీం పాల్గొన్నారు.
సెల్ టవర్ నిర్మాణాన్ని విరమించుకోవాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES