Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణం..

ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణం..

- Advertisement -

ఎంపిడిఓ క్రాంతి కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

పాడి రైతులకు అండగా గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకుల్లో జాబ్ కార్డ్ కలిగిన వారికి ఆవులు, గేదెలు, గొర్ల పెంపకం దారుల కోసం ఉపాధిహామీ పథకంలో షెడ్ల నిర్మాణం కోసం మండలంలోని కొండంపేట, ఇప్పలపల్లి  గ్రామాలలో శుక్రవారం ఎంపిడివో క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ముగ్గు పోసి నిర్మాణాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిడివో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పశువుల షెడ్ల నిర్మాణం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇటీవలే మల్హర్ ఎంపిడివో గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కొండంపేట గ్రామానికి విచ్చేసిన ఎంపిడివో క్రాంతి కుమార్ ని ఈ సందర్బంగా కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈసీ మంగి లాల్, టిఏ శైలజ ,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -