- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న ఎస్వి గార్డెన్ పై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు బిఆర్ఎస్ నాయకులు, ఆర్టీఐ గంగల రవీందర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీకి ఎలాంటి టాక్స్ చెల్లించకుండా ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారని, బొబ్బిలి చెరువు భూమి కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -


