నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు వలిగొండ మండలంలోని నాగారం గ్రామం, చౌటుప్పల్ మండలంలో ఎస్. లింగోటం, నారాయణపూర్ మండలం గుడిమల్కాపురం గ్రామం లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలోఉన్నాయని,
ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇండ్లు ఎన్ని ఉన్నాయని అని చౌటుప్పల్ ఆర్డిఓని,ఎంపి డి ఓ ని అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు నిర్మాణాపు పనులు పూర్తి అయినంత వరకు లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు
సిమెంట్,ఇటుక, స్టీల్ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నారా అని, తక్కువ ధరకే ఇప్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రతి సోమవారం బేస్మెంట్ లెవెల్ పూర్తయిన లబ్ధిదారులకు లక్ష రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి,ఎంపీడీవో సందీప్ కుమార్, హౌసింగ్ డిఈనాగేశ్వరరావు,సిబ్బంది,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.