Saturday, August 2, 2025
E-PAPER
HomeNewsఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజు భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, మాట్లాడారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏ దశలో ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులు అందరూ  వేగంగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

డబ్బులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  ప్రతి సోమవారం మీ అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయని లబ్ధిదారులకు సూచించారు.ఇండ్లు ప్రారంభించడానికి  ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మీ గ్రామంలో మహిళా సంఘాల ద్వారా లోన్ తీసుకొని  ఇంటి నిర్మాణాలు  వేగంగా చేపట్టాలన్నారు. మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులకు సంబంధించిన మెటీరియల్ ను కూడా తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రతి మండలంలో కమిటీలు వేశావని తదనుగుణంగా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -