Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

శుక్రవారం రోజు భువనగిరి మండలం కూనూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని అవి ఏ ఏ దశలో ఉన్నాయ అని ఎంపి డి ఓ ని అడిగి తెలుసుకున్నారు. 

ఇప్పటివరకు నిర్మాణ పనుల జరిగినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి ఉపయోగించే ఇసుక, ఇటుక లని పరిశీలించారు. ఇందిరమ్మ  ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు ఇసుక,సిమెంట్, స్టీల్,ఇటుక వంటివి రేట్లు మాట్లాడి తక్కువ ధరలకే ఇప్పిస్తున్నారని అని సంబంధిత అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -