Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తగూడెం-గోరెంట్ల రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

కొత్తగూడెం-గోరెంట్ల రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిధిలోని కొత్తగూడెం.. గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ, కొత్తగూడెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.

గత కెసిఆర్ ప్రభుత్వంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రతిపాదనలో రోడ్డు మంజూరు కావడం జరిగిందని, అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలు హడావిడిగా శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ, ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం అన్నారు. అలాగే మండల పరిధిలోని పలు గ్రామాలకు రోడ్లు మంజూరు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి ప్రజల సమస్యలను తీర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మేడ్డుల రమేష్, మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, ఉప సర్పంచ్ మహేష్, నాయకులు సింహాద్రి, కరుణాకర్, సత్యనారాయణ, సందీప్, ప్రవీణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -