- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర : కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, నాయకులు జాటోత్ వెంకన్న లు ఇటీవల వేరువేరు ప్రమాదాల్లో గాయపడ్డారు. వీరిని కాంగ్రెస్ మండల నాయకులు శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని, ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, దుంపల శ్యాం, బానోత్ శేఖర్, గుగులోత్ పంతులు, జాటోత్ వెంకన్న నాయక్ తదితరులు ఉన్నారు.
- Advertisement -