నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ ఆరోగ్యం బాగాలేనందున సోమవారం నిజామాబాద్ అర్బన్ లోని వీక్లీ మార్కెట్ లో గల ఆయన నివాసానికి వెళ్లి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాగృతి అర్బన్ బాధ్యులు కరిపే రాజు పరామర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ కు అండగా పార్టీలకు అతీతంగా ఈర్ల శేఖర్ కుటుంబానికి అండగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఈర్ల శేఖర్ తెలంగాణ ఉద్యమంలో వందల సార్లు అరెస్ట్ లు,కోర్టు కేసులు, బుల్లెట్ వాటర్ ఫైరింగ్ లాంటి దెబ్బలను తట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ఉద్యమం చేసిన నాయకునికి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఇసుమంతయిన న్యాయం జరగలేదు. ఈర్ల శేఖర్ లాంటి ఉద్యమకారుల త్యాగాల వల్లే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోగలిగాం,కావున ప్రతీ ఒక్కరూ మానవతా దృక్పథంతో ,ఈర్ల శేఖర్ కు అండగా నిలవాలి. ఈర్ల శేఖర్ ఆరోగ్య పరిస్థితిని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లి ఈర్ల శేఖర్ కుటుంబాన్నీ ఆదుకునేలా ప్రయత్నం చేస్తా అని తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ కు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



