Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం: ఎస్ఐ

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం తగదు అని అలా సేవించిన వారిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పసర ఎస్ ఐ అచ్చ కమలాకర్ అన్నారు. ఆదివారం స్టేషన్లో ఎస్సై పాత్రికేయులతో  మాట్లాడుతూ  మండలంలోని గ్రామాలలో ప్రధాన రహదారుల మీద బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ, సేవించిన మద్యం సీసాలను వాటిని  రోడ్లపై పగలగొడుతూ వికృత చేష్టలు చేయకూడదని, రహదారిపై వెళ్తున్న వారిని మద్యం సేవించి భయభ్రాంతులకు గురి చేయరాదని అన్నారు. ప్రతిరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో పలు రహదారుల మీద పోలీస్ పెట్రోలింగ్ నడుస్తుందని పెట్రోలింగ్ సమయంలో తాగి పట్టుబడిన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ కనబడిన తగు చట్టపరమైన చర్యలు మరియు కేసులు నమోదు చేయబడతాయని పసర ఎస్సై అచ్చ కమలాకర్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -