Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్ గా పోటీ 

గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్ గా పోటీ 

- Advertisement -

గతంలో గ్రామానికి ఏ పదవి లేకున్నా సేవలందించా: ఇందూరి యాదిరెడ్డి 
నవతెలంగాణ – ఆలేరు 

గొలనుకొండ గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇందూరి యాదగిరి రెడ్డి అన్నారు. గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తు పై ఓటు వేయాలని కోరారు. గతంలో తనకి ఏ పదవి లేకుండా స్కూల్లో నల్లబల్లాలు గుడివద్ద అభివృద్ధి కార్యక్రమాలు తడి చెత్త పొడి చెత్త బకెట్లను ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని తనను గెలిపిస్తే ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగాం ఉపేందర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యంతో పాటు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్లాట్ల పంపిణీ జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు ఇందూరి యాదగిరి రెడ్డిని బలపరచామని వారి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ వాటిక అసంపూర్తిగా ఉంది ఒక 20 శాతం సిసి రోడ్లు పూర్తి కావాల్సి ఉన్నాయి. ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో మోరీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రైతుల కోసం వేసే మార్కెట్ స్థలాన్ని కేటాయించి పునరుద్దించాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచిగా గెలిచిన వెంటనే ఆ పనులను పూర్తి చేస్తామని అన్నారు.

బండ మైసయ్య మాజీ ఉప సర్పంచ్ మరియు మందారం మధు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకోరిక మేరకు సర్పంచిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ గొలనుకొండలో జెండా ఎగర వేయించడమే మా లక్ష్యం అన్నారు. వార్డ్ మెంబర్లు బైరపాక గణేష్. కొలనుపాక సత్యనారాయణ,గంధ మల్ల లక్ష్మి,బాకీ యాదగిరి,భువనగిరి అండాలు,బందారం సత్యలక్ష్మి,లగ్గాని కవిత,బైరపాక పద్మ,ఇందూరు అంజిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -