Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పక్కదారి పడుతున్న యూరియా పంపిణీపై వివాదం..

పక్కదారి పడుతున్న యూరియా పంపిణీపై వివాదం..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని క్రాంతికుమార్ ఫర్టిలైజర్ షాపులో యూరియా పంపిణీపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ షాపుకు 200 యూరియా బస్తాలు వచ్చినప్పటికీ, ఆ షాపు యజమాని రైతులకు యూరియా బస్తాలు అందుబాటులో లేవని, వచ్చిన బస్తాలన్ని రైతులకు అందజేశానని చెప్పడంతో వివాదం చెలరేగింది. సుమారు 50 మంది రైతులు బస్తాల కోసం షాప్‌కు చేరుకోగా, స్టాక్ లేదన్న కారణంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి (ఏఓ) పూర్ణిమ వెంటనే క్రాంతి కుమార్ ఫర్టిలైజర్ షాపు వద్దకు చేరుకుని రికార్డులు పరిశీలించి, తనిఖీ చేశారు.

తనిఖి చేసే సమయంలో షాప్ యజమాని అయిన గట్టు రమేష్, ఒక మండల వ్యవసాయ అధికారి అని చూడకుండా రైతుల ముందు ఆమెతో వాగ్వాదానికి దిగిన సంఘటన రైతులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం రైతుల ఒత్తిడితో ఎఓ ఫర్టిలైజర్ షాపు గోదామును తనిఖీ చేయగా.. యూరియా బస్తాలు లేవు. గోదాం ఖాళీగా ఉన్నట్లు బయటపడింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, యూరియా పక్కదారి పడుతోందని ఆరోపించారు. ఇకపై ఇలాంటి షాపులకు అలాట్‌మెంట్ ఇవ్వకుండా, అధికారుల సమక్షంలోనే ఇతర షాపుల ద్వారా పారదర్శకంగా పంపిణీ జరగాలని రైతులు డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad