రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర.. స్టార్స్ అందరూ పవర్ ఫుల్ లుక్స్‌లో కనిపించిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది.
డి.సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజ మాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’, మోనికా సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది అని చిత్రయూనిట్ తెలిపింది. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్, నిర్మాత: కళానిధి మారన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, డిఓపీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్.
‘కూలీ’.. పక్కా మాస్ కమర్షియల్
- Advertisement -
- Advertisement -