- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ సహకార వారోత్సవాలను పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఆవరణలో జెండాను ఆవిష్కరించి, ఘనంగా వారోత్సవాలను నిర్వహించారు. సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు రుణాలు, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, యూరియా కొరత లేకుండా సేవలందించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు,సీఈవో సంతోష్,సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



