నవతెలంగాణ – రాజాపేట
పత్తి రైతులు తప్పనిసరిగా విక్రయించడానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి పద్మజ కోరారు. మంగళవారం రాజాపేట విలేకరులకు వివరాలు చెప్పారు. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండి క్లస్టర్ ఏఈఓ లను సంప్రదిస్తే తమ మొబైల్ లో యాప్ వేసి స్లాట్ బుక్ చేయనున్నట్లు తెలిపారు. పత్తి అమ్మడానికి చౌటుప్పల్ ప్రభుత్వం మంజూరు చేసినదని ఆలేరు, జనగాం, జగదేవ్పూర్ లో అమ్మడానికి వీలుగా అనుమతి కావాలని కోరినట్లు తెలిపారు.
కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ అయితేనే విక్రయాలు జరుగుతాయని రైతులకు గుర్తించాలని సూచించారు. మండలంలో 17 రైతు ధాన్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐకెపి ఆధ్వర్యంలో 5, పిఎసిఎస్ రేణిగుంట ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తాయని తెలిపారు. వాతావరణ దృష్ట్యా వరి కోత కోయని రైతులు ఇప్పుడే కోయవద్దని, కోసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసినట్లయితే మ్యాచర్ చూసి వెంటనే కాంటా చేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశానుసారం అమలు చేయాలని కోరారు.



