Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 17 నుంచి మద్నూర్ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు నిలిపివేత

నవంబర్ 17 నుంచి మద్నూర్ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు నిలిపివేత

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ మద్నూర్ మండల శాఖ ప్రకటన విడుదల
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల పత్తి సిసిఐ కొనుగోలు అలాగే ప్రయివేటు కొనుగోలు ఈనెల 17 సోమవారం నుండి పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ మద్నూర్ మండల శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీసీఐ అధికారులు  l1 l2 l3 పేరుతో కొన్ని మిల్లులు నడిపి మరికొన్ని మిల్లులు నడపనందున రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులు నడపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సీసీఐ అధికారులకు రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ద్వారా ఎన్నిసార్లు విన్నవించినా అన్ని మిల్లుల్లో నడపనందున తప్పని పరిస్థితుల్లో ఈ నెల 17న సోమవారం నుండి సిసిఐ కొనుగోళ్లతో పాటు ప్రైవేట్ కొనుగోలు కూడా నిర్వాసికంగా నిలిపి వేయుటకు నిర్ణయించడంమైందని తెలిపారు. దీనికి పత్తి రైతులు సహకరించాలని మద్నూర్ మండల పరిధిలోని పత్తి మిల్లర్ల అసోసియేషన్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -