- Advertisement -
- ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి
- నవతెలంగాణ-బెజ్జంకి
- ఆకాల వర్షాభావం వల్ల ఆశించిన పత్తి దిగుబడి రాకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారని..వచ్చిన అరకొర పత్తికి మద్ధతు ధరతో రైతులు ఆర్థికంగా నష్టపోయే దుస్థితి నెలకొనడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి క్వి. రూ.12 వేలు మద్ధతు ధర కల్పించి కొనుగోలు చేయాలని మండల సీపీఐ(ఎం) పార్టీ పక్షాన నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడారు. రైతులు సాగు చేసిన పత్తి ఈ యేడు దిగుబడి ఆశాజనకంగాలేదన్నారు.ఎరువుల కొరత, అకాల వర్షాలు రైతుల ఆశలపై నిల్లుజల్లయన్నారు. వచ్చిన అరకోర పత్తి దిగుబడిని ప్రయివేట్ మిల్లలకు విక్రయించేందుకు వెళ్తే క్వి.రూ.4 వేలు ధర చెల్లించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేల ప్రభుత్వం మద్ధతు ధర కల్పించాలని కోరారు. మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, సంగ ఎల్లయ్య,బోనగిరి లింగం పాల్గొన్నారు.
- Advertisement -