నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన బబ్బురి రమేష్ వాళ్ళ నాన్న నడ్పి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని తెలిపారు.పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన పున్నంరెడ్డి వాళ్ళ నాన్న అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే గ్రామానికి చెందిన టిప్ టాప్ గంగారెడ్డికి ఇటీవల ప్రమాదవశాత్తు చేయు విరిగింది. ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES