Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంపీఎస్‌ఎల్‌వీ-సీ62కి కౌంట్‌డౌన్‌

పీఎస్‌ఎల్‌వీ-సీ62కి కౌంట్‌డౌన్‌

- Advertisement -

న్యూఢిల్లీ : పీఎస్‌ఎల్‌వీ-సీ62/ఈఓఎస్‌-ఎన్‌1 రాకెట్‌ను ప్రయోగించేం దుకు కౌంట్‌డౌన్‌ ఆదివారం ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 12న (సోమవారం) శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఉదయం10.17గంటలకు ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ62/ఈఓఎస్‌-ఎన్‌1, భారత్‌, విదేశాలకు చెందిన స్టార్టప్‌లు, విద్యాసంస్థలు అభివృద్ధి చేసిన 15 సహ-ప్రయాణిక ఉపగ్రహాలను మోసుకెళ్తోందని ఇస్రో తెలిపింది. ఈఓఎస్‌-ఎన్‌1 భూపరిశోధన ఉపగ్రహాన్ని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం రూపొందించినట్టు పేర్కొంది. పీఎస్‌ఎల్‌వీ-సీ62/ఈఓఎస్‌-ఎన్‌1 శ్రీహరికోట నుంచి 105వ ప్రయోగం కానుంది. ఇది పీఎస్‌ఎల్‌వీ కేటగిరీలో 64వది, పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌ వేరియంట్‌లో ఐదవ మిషన్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -