Thursday, November 27, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

- Advertisement -

– చిన్నారికి గాయాలు
నవతెలంగాణ – వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్‌ మండలం ఆరేపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢకొీట్టడంతో దంపతులు మృతిచెందారు. చిన్నారికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డికి చెందిన వసీం(27), ఐఫా(22) దంపతులు. వారికి ఒక కుమార్తె. బుధవారం భార్యాభర్తలు చిన్నారితో కలిసి ద్విచక్ర వాహనంపై చిన్నారితో కలిసి వెళ్తుండగా.. కరీంనగర్‌ వైపు వెళ్తున్న వారిని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వసీం, ఐఫా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చిన్నారికి కాలు విరిగినట్టు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -