నవతెలంగాణ-హైదరాబాద్: నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడినట్లుగా సమాచారం. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పై 152 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయ తెలిసిందే.
ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 98.4 శాతం పోలింగ్ నమోదు కాగా 767 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 15 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. 13 మంది ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. వారిలో బీజేడీకి చెందిన ఎంపీలు ఏడుగురు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు నలుగురు, అకాళీదల్ నుంచి ఒకరు ఇండిపెండెంట్ సభ్యుడు మరొకరు ఉన్నారు.