నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
100సంవత్సరాల సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయం లో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద. సుదర్శన్ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26 న కన్పూర్ లో సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుండి దేశ స్వతంత్ర పోరాటం తో పాటు, హక్కుల కోసం కూడా బ్రిటిష్ వారితో పోరాటాలు చేసిందని, తెలంగాణా విలీనం కోసం రైతాంగ సాయుద పోరాటం చేసి లక్షలాది ఎకరాల భూమి పంచి, నిజాం నిరంకుశ పాలనను అంతం చేసిందని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సైతం కార్మిక హక్కులు, జీవోల అమలు కోసం పోరాటం చేస్తోందని, కనీస వేతనాలు, కార్మికులు ఉద్యోగులు అందరిని రెగ్యులర్ చేయాలని, కనీసం వేతనo రూ.26 వేలు ఇవ్వాలని పోరాటలు చేస్తోందని అన్నారు. 100 సంవత్సరాలు గడిచిన నూతనోత్సాహంతో ముందుకు వెళుతోందని, జనవరి 3 న జిల్లాలో 100 సంవత్సరాల సందర్బంగా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనవరి 18 న ఖమ్మం లో 5 లక్షల మందితో ముగింపు సభ ఉంటుందని, 40 దేశాల నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. 15 వేల మందితో జనసేవాదల్ కార్యకర్తల కావాతు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి. రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.వి. అనసూర్య, అజ్జ. వేణు, సీపీఐ సీనియర్ నాయకులు నల్ల. చంద్రమౌళి, వడ్డెపెల్లి. లక్ష్మన్, కొంక విజయ్, గాజుల లింగం, అరగొండ శ్రీరాములు, ఆనందం, గాజుల లక్ష్మి, నర్సింగోజీ మారుతి తదితరులు పాల్గొన్నారు.



