సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి
నవతెలంగాణ – తిమ్మాజిపేట
రేపు జరిగే బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి ప్రకటించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో లక్ష్మణాచారి భవన్లో సిపిఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ నేడు నాడు జరిగే రాష్ట్ర బందు పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాలు ఉండే బీసీ సంఘాల సైతం బందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. గ్రామాలలో ఉండే వ్యాపారస్తులు అఖిలపక్షం సంఘాల నాయకులు తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో కొన్ని పార్టీలు బీసీలకు మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న బిసి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలో ఉండి ఢిల్లీ సైతం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు సహకరించాలన్నారు. ఈ బీసీ రిజర్వేషన్లు కేంద్ర మంత్రుల సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజా సంఘాల మద్దతు ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి, జిల్లా అధ్యక్షులు కపిలవాయి గోపి చారి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మర్యాద వెంకటయ్య, మారేడు శివశంకర్ సిపిఐ నాగర్కర్నూల్ పట్టణ సహాయ కార్యదర్శి కొత్త రామస్వామి బీసీ హక్కుల సాధన జిల్లా నాయకులు పూసల సుధాకర్, సిపిఐ నాయకులు చిన్నపాగ శ్రీనివాసులు, వాడాల బాల పీరు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ జేఏసీ బంద్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES