Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబోణీ కొట్టిన సీపీఐ(ఎం)

బోణీ కొట్టిన సీపీఐ(ఎం)

- Advertisement -

దుమ్ముగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పెద్ది చిన్నక్క ఏకగ్రీవం
నవతెలంగాణ- దుమ్ముగూడెం

సర్పంచ్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ముందే బోణీ కొట్టింది. భద్రాద్రి కొత్తగూడె జిల్లా దుమ్ముగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి పెద్ది చిన్నక్క మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం లాంఛనం కానుంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు పంచాయతీ పరిధిలో మొత్తం 10 వార్డులకుగాను ఆరు వార్డులు సీపీఐ(ఎం), రెండు వార్డులు కాంగ్రెస్‌, ఒకటి బీఆర్‌ఎస్‌, ఒకటి బీజేపీ అవగాహనలో భాగంగా ఏకగ్రీవం అయ్యాయి. ఉపసర్పంచ్‌ పదవి సైతం సీపీఐ(ఎం) కైవసం చేసుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -