వార్డు సభ్యుడిగా దెందె సురేష్
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో ఈ నెల 11న నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో సీపీఐ(ఎం) అభ్యర్థులుగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొమ్మిదో వార్డు మెంబర్గా పొన్న శిరీష సురేష్, మూడో వార్డు మెంబర్గా దెందె సురేష్ ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేశామని వారు తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని, సంక్షేమ పథకం అర్హులకు చేరేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ నెల 22న పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్ గా, దెందె సురేష్ మూడో వార్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చెర్వుఅన్నారం ఉపసర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి పొన్న శిరీష సురేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



