పది జిల్లాల్లో 11 భారీ సమావేశాలు నిర్వహణ
ప్రచారంలో పార్టీ అగ్రనేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీపీఐ(ఎం) ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు 12 నుంచి 29 వరకు ఎంపిక చేసిన పది జిల్లాల్లో 11 నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించింది. అదే సమయంలో ఆగస్టు 17 నుంచి 30 వరకు ఇండియా బ్లాక్ నిర్వహిస్తోన్న రాష్ట్రవ్యాప్త ఓటరు అధికార్ యాత్రలో కూడా పాల్గొంది. 11 సమావేశాల్లో 7,000 మందికి పైగా ప్రముఖ పార్టీ, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) సిట్టింగ్ సీట్లు విభూతిపూర్ (సమస్తిపూర్ జిల్లా), మాఝి (సరణ్ జిల్లా)లలో కూడా సమావేశాలు నిర్వహించినట్టు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే తెలిపారు. గతసారి తాము స్వల్ప తేడాతో కోల్పోయిన స్థానాలైన మతిహాని (బెగుసరారు జిల్లా), పిప్రా (తూర్పు చంపారణ్ జిల్లా)లలో కూడా భారీ సమావేశాలను నిర్వహించామని అన్నారు. ఈ నాలుగు స్థానాలు రాష్ట్ర కమిటీ మొదటి ప్రాధాన్యత జాబితాలోని ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర కమిటీ రెండో ప్రాధాన్యత జాబితాలో ఏడు సీట్లను గుర్తించిందని, వీటి కోసం సమావేశాలు పూర్నియా (డిస్ట్ పూర్నియా), బిస్ఫీ (మధుబని), పర్బట్టా (ఖగారియా), మెహసి (సహర్సా), బహదూర్‌పూర్ (దర్భంగా), నౌతాన్ (పశ్చిమ చంపారన్), మొహియుద్దీన్ నగర్ (సమస్తిపూర్)లలో జరిగాయని అన్నారు. 11 సమావేశాల్లో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే ఎనిమిది సమావేశాల్లో పాల్గొనగా, మరో పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.విజయ రాఘవన్ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. వీరితో పాటు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి లాలన్ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అజరు కుమార్ (ఎమ్యెల్యే), రాజేంద్ర ప్రసాద్ సింగ్, ప్రభురాజ్ నారాయణరావు, వినోద్‌కుమార్, శ్యామ్‌భారతి, అహ్మద్ అలీ, రణధీర్ యాదవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యేంద్ర యాదవ్, ఎమ్మెల్యే రాజమంగళ్ ప్రసాద్ తదితరులు తమ సొంత జిల్లా సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సమావేశాలన్నీ మంచి ప్రభావాన్ని చూపాయని అశోక్ ధావలే అన్నారు. ఎందుకంటే ఈ సమావేశాలు ఇండియా బ్లాక్‌ను బలోపేతం చేయడంతో బీజేపీ-ఎన్డీఏను ఎలాగైనా ఓడించాలనే రాజకీయ దిశను, ఈ కీలకమైన ఎన్నికల్లో పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసే సంస్థాగత కర్తవ్యాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు, కార్పొరేట్-మతతత్వ, నయా ఫాసిజం తీవ్రమైన ప్రమాదం, అవినీతి, నేరపూరిత బీజేపీ-కేంద్ర ఎన్నికల సంఘం బంధంపై కూడా ఈ సమావేశాలు దృష్టి సారించాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలన్నింటిలోనూ సీపీఐ(ఎం) అన్ని జిల్లాలకు సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ఇండియా బ్లాక్ ..ఓటరు అధికార్ యాత్ర ముగింపు ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ కూడా ప్రసంగిస్తారు.
ఓటర్ అధికార్ యాత్రలో సీపీఐ(ఎం) నేతలు
బీహార్‌లో ఆగస్టు 17 నుంచి 30 వరకు జరిగిన ఇండియా బ్లాక్ రాష్ట్రవ్యాప్త భారీ ఓటర్ అధికార్ యాత్రలో సీపీఐ(ఎం) నేతలు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ-షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ”ఓటు చోర్, గడ్డి ఛోడ్” అనే ప్రధాన నినాదంతో ఇండియా బ్లాక్ పార్టీలు, ఇతరుల నేతృత్వంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారని అశోక్ ధావలే తెలిపారు. రెండు వారాల యాత్ర గొప్ప ప్రభావాన్ని చూపిందన్నారు. ఆగస్టు 17న ససారంలో జరిగిన ప్రారంభ సమావేశంలో సీపీఐ(ఎం) తరపున మాజీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ ప్రసంగించారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అరుణ్ కుమార్ మిశ్రా, కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఎమ్మెల్యే అజరు కుమార్ యాత్రలో పాల్గొన్నారు. ఆగస్టు 30న భోజ్‌పూర్ జిల్లాలోని అరాలో జరిగిన చివరి భారీ బహిరంగ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే ప్రసంగించారు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ(ఎం) సన్నద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES