Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు42% రిజర్వేషన్ల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన

42% రిజర్వేషన్ల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ 
జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదివారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ఏ బూర్జువా పార్టీలకు లేదన్నారు. ప్రస్తుతం ఓట్ల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంవత్సరం పాటు కుల గణన పేరుతో సమగ్ర సర్వే చేసిందన్నారు. ఆ సర్వేలో బీసీలు 56%, ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ఓసీలు 10%, ఏ కులము కాదని 3% మంది ఉన్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి గవర్నర్కు పంపించారన్నారు. అనంతరం ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి వద్దకు పంపించగా బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్లు ముస్లిమ్స్ ను తొలగించాలని బిల్లు పాస్ కాకుండా నిలిపివేసిందన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముస్లిమ్స్ ను బీసీలుగానే పరిగణిస్తున్నారని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, తెలంగాణలో మరొక న్యాయంగా కేంద్ర ప్రభుత్వం విభజించి పాలిస్తున్నదని దుయ్యబట్టారు.ఈ  కార్యక్రమంలో  పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు యానాల కృష్ణారెడ్డి,  మండల కమిటీ సభ్యులు ఒంటె పాక కృష్ణ, పాలడుగు పరమేష్, గింజల లక్ష్మి, గుడుగుంట్ల బుచ్చిరాములు, షాబాద్ బిక్షం రెడ్డి,  మర్రి ఎల్లయ్య, పాలడుగునరసింహ, సిరికొండ శివ, చౌగోని రాములు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img