Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గజ్జి నరసయ్య సతీమణికి సీపీఐ(ఎం) ఘన నివాళి

గజ్జి నరసయ్య సతీమణికి సీపీఐ(ఎం) ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు నరసయ్య సతీమణి గజ్జి లింగమ్మకు సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కమిటీ ఘన నివాళి ప్రకటించడం జరిగింది. మండలంలోని  పసర గ్రామపంచాయతీ పరిధిలోని మెుద్దుల గూడెం గ్రామంలో ఆదివారం లింగమ్మ ప్రధమ వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) బృందం లింగమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. నరసయ్య కుటుంబం సుదీర్ఘకాలంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడిగా కొనసాగుతు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆ కుటుంబానికి సీపీఐ(ఎం) ఎల్లవేళలా అండగా ఉంటుందని మండల కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుండు రామస్వామి, తీగల ఆగిరెడ్డి, కడారి నాగరాజు, పురుషోత్తం రెడ్డి పాత్రికేయుడు సామ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad