Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల సావనీర్‌ ఆవిష్కరణ

సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల సావనీర్‌ ఆవిష్కరణ

- Advertisement -

– మొదటికాపీని జాన్‌వెస్లీకి అందించిన బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగో మహాసభల సావనీర్‌ను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆవిష్కరించారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో ఆ పార్టీ రాష్ట్ర మహాసభలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర మహాసభల సందర్బంగా ఆహ్వాన సంఘం ముద్రించిన సావనీర్‌ మొదటి కాపీని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీకి బివి రాఘవులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగో మహాసభలు కార్మికుల కష్టార్జితంతో జరపడం దేశానికి మార్గం చూపిందని అన్నారు. సంగారెడ్డి పార్టీ ఉద్యమం పట్టుదలతో మహాసభలను జయప్రదం చేయడానికి కృషి చేసిందని చెప్పారు. మహాసభల సందర్బంగా సావనీర్‌ ముద్రించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, పి సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జి జయరాజు, ఎం అడివయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img