- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్, రైతుసంఘం డివిజన్ మాజీ కార్యదర్శి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి, ఘనమైన నివాళు అర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా, మండల, గ్రామ నాయకత్వం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -